Yettundera Vuru pata Song Lyrics from Folk Song - Download
Mana vuri pata Lyrics
Lyrics-Singer-Music: Charan Arjun.
Mana Uru Village Motivational Song By Charan Arjun
ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా..
ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
అన్నదమ్ములోలె ఉన్నామురా..
ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా.... | 2 |
ఈ కులము ఆ కులము తేడాలు లేకుండ
వరసవెట్టి పిలుసుకున్నామురా ......
ఒక చెట్టునీడన వందమందిన్నట్టు
ఊరంత ఒక్కటై ఉన్నాము రా....
ఆ చెట్టుకొమ్మలు విరిగి నిలువనీడ లేక
ఊరు ఆగం అవుతుంటే ఊరుకుంటావేందిరా.......
ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
అన్నదమ్ములోలె ఉన్నామురా..
ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
వీరబ్రహ్మంగారి జాతరోచ్చిందంటే
ఊరు చాలనంత మందిరా ....
అపుడు ఎంత సందడుండేదిరా.... ఎంత సందడుండేదిరా....
ఆ సందడేమోగాని ఏటా జాతర జేసేవాడే లేడురా ......
ఆ దేవుడికే దిక్కు లేదురా ..... ఆ దేవుడికే దిక్కు లేదురా .....
బడికాడ బాగోతమాడుతున్నారంటే
సపలెత్తుకుని వెళ్ళామురా....
కలిసి కాలక్షేపం జేశామురా....
పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే
మనకు వాళ్లకు మాటలేలేవని
తలుపు మూస్తున్నరు పొద్దువూకంతనా....
ఆ వైభోగం ఏమాయెరా.....
ఉరికి వైరాగ్య మెట్టొచ్చెరా....
ఆ ఆనందమెటువాయెరా....
మన ఉరికి ఏ దిష్టి తగిలిందిరా....
ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
అన్నదమ్ములోలె ఉన్నామురా..
ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
దసర పండుగనాడు జమ్మికెళ్తువుంటే
కళ్ల సంబురామేనురా ....
అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా .... అపుడు ఉరు మొత్తం ఒక్కచోటరా ....
నేడు పార్టీలు పగలంటూ
మనవాళ్ళు మందంటూ వీది వీదికో జట్టురా.....
ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా ..... ప్రతి ఇంటికొక జమ్మి చెట్టు రా .....
మతమంటు కులమంటు మంటలే రాజేసి
ఊరునాగంజేసే రాజకీయం
ఇపుడు వంశాల గోత్రాల కొత్త కయ్యం
ఎవడి స్వార్థం కొరకు వాడు విడగొడుతుంటే
ఎడ్డిగా మనమంత చూస్తూ ఉన్నం
అదే అభివృద్ధి ఆపే కొరివిదయ్యం
ఆ బంధాలు ఏమాయెరా...
మన ఊరి అందాలు ఎటువాయెరా....
యాడేసిన ఆ గొంగడాడుందిరా....
ఇన్నాళ్లు ఎంబావుకున్నామురా ....
ఎట్టుండేరా.. ఊరు ఎట్టుండెరా
ఎనకట మన ఊరు ఎట్టుండేరా..
అన్నదమ్ములోలె ఉన్నామురా..
ఈ అడ్డుగోడలు ఎవడు వెట్టిండురా....
సదువుకున్నోలంత జ్ఞానమున్నొలంత
బతుకుదారి మెతుకులాడుతు
ఊరు విడిచి దూరంగా ఉన్నరు.... ఊరు విడిచి దూరంగా ఉన్నరు....
ఊరు మీద ప్రేమ ఎక్కువున్నోల్లంత
ఇక్కడే మిగిలి ఉన్నరు ....
వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నరు
మద్యలో ఉండేటి పెద్దమనుషులేమో
అర్ధం కాకుండ ఉన్నరు
పార్టీల చేతుల్లో బొమ్మలవుతున్నరు
అందుకే ఉళ్ళోన పుట్టిన ప్రతివాడు
గ్రామాభివృద్దే ద్యేయమయ్యి
తీర్చుకోవాలి తన ఋణమును...
అమ్మ తరువాత అమ్మేనురా....
ఊరంటే నీ తొలి చిరునామరా ....
నువ్వు ఎంతెత్తుకు ఎదిగినా....
నీ మూలం ఈడే ఉన్నాదిరా ....
ఊరు కన్నీరుగా మారితే
ఆ ఉసురు యాడున్న తగిలేనురా....
మన ఊరు బాగే తోలి భాద్యతా ....
నీ వంతు చేయూతనందించరా .........