Movie Name | Folk song (2024) |
---|---|
Director | |
Star Cast | Amardeep Chowdary, Karishma Jangid |
Music | Honey Ganesh |
Singer(s) | Divya Malika |
Lyricist | D Kesava |
Music Label | Nivriti Vibes |
O Radha song lyrics in telugu
Song Category | Folk Song |
Lyrics | D Kesava |
Singer | Divya Malika |
Music | Honey Ganesh |
Artists | Amardeep Chowdary, Karishma Jangid |
Music Lable |
పల్లె పైరు పైర కోయిల
పరుగు తీసె పడుచు పిల్ల
తనవాడే ఏడని… మదిల ఉన్న వాడిని
చుట్టుముట్టు ఎందరున్న… చూపు తనవాడి పైన
ఎప్పుడు వస్తాడని నను ఏలుకుంటాడని
ఓ రాధా… మ్ మ్ మ్
ఓ రాధా… మ్ మ్ మ్
కళ్ళకి కాటుకనెట్టిన
నుదుటన సింధూరమెట్టిన
ముద్దుగున్ననాయే…
చెవులకు కమ్మాలనెట్టిన
ముక్కుకు ముక్కేర వెట్టిన
ముద్దొస్తున్ననాయే…
ఎన్నో కలల రాజు
ముందుకొచ్చే వేళనే
ముద్దుగుంటె మంచిదని
ముస్తాబైతున్ననే |2|
ఓ రాధా… నీకెందుకె బాధా
నీవెట్లున్నా అందగత్తెవే కాదా
ఓ రాధా… నీ కృష్ణుడి రాత
మురిసిపోయే ఒక మూల
ఆనందమే తెలుసా
చూసుకుంట అమ్మలా
తన ముద్దు గుమ్మలా
ఉంట నేను జన్మలా
తనకి తోడిలా
నేను మహారాణిలా
తాను మహరాజులా
గుట్టుతో నన్నిలా
ఆపేది లేదిగా
పట్టుచీర నేను పట్టుపంచా తాను
కట్టుకోని మేము ఆలుమొగలం అవుతాము
ఎన్నో కలల రాజు ముందుకొచ్చే వేళనే
ముందు మురుపు మంచిదో కాదో అర్దమవకున్నదే
ఓ రాధా… నీకెందుకె బాధా
నీవెట్లున్నా అందగత్తెవే కాదా
ఓ రాధా… నీ కృష్ణుడి రాత
మురిసిపోయే ఒక మూల
ఆనందమే తెలుసా
నాడు రాధాకృష్ణులు ప్రేమ పెళ్ళి ఓడినా
నేడు రాధ జన్మలో ప్రేమ పెళ్ళి జరుగునా
దిన దినం గడిసినా బావగారి జూసినా
గావురాల బిడ్డనని ఇక అడుగేస్తానా
నచ్చినానా నేను, నచ్చుకున్న నిన్ను
ముద్దుగున్ననా నేను, ముందుకొచ్చేసాను
ఎన్నో కలల రాజు
ముందుకొచ్చే వేళనే
ముద్దుగుంటె మంచిదని
ముస్తాబైతున్ననే.
ఓ రాధా… నీకెందుకె బాధా
నీవెట్లున్నా అందగత్తెవే కాదా
ఓ రాధా… నీ కృష్ణుడి రాత
మురిసిపోయే ఒక మూల
కన్నీళ్ళు దేనికా.