Movie Name | Folk song (2025) |
---|---|
Director | PAINDLA RAJESH |
Star Cast | POOJA NAGESHWAR & NIKKYCHERRY |
Music | VENKAT AZMEERA |
Singer(s) | BODDU DILEEP , VAGDEVI |
Lyricist | KALYAN SUMITRA |
Music Label | USG TUNES |
నటీనటులు : పూజా నాగేశ్వర్ & నిక్కీచెర్రీ
లిరిక్స్ రైటర్: కళ్యాణ్ సుమిత్ర
సంగీతం: వెంకట్ అజ్మీరా
గాయకులు: బొడ్డు దిలీప్ , వాగ్దేవి
దర్శకత్వం & కొరియోగ్రఫీ: పైండ్ల రాజేష్
వాకిట్లో వయ్యారమా ముద్ద బంతుల్లో ఓ అందమా
నిలువెత్తు బంగారమా ఇంతందం నీకె సొంతమా
ఓ పిల్ల రసగుల్లా నువ్వు నవ్వితే నా గుండె గుల్ల
తల్లడిల్లే ఎల్లకిల్లా నా ప్రాణమంతా నీ వల్ల
మాయ మాటలు చాలురా పిల్లోడా
పొగిడి పొందలేవురా నన్నే
నీకు దక్కని దాన్నిరా
నన్నే ఇడిచి దూరముండరా
పుత్తడి బొమ్మ అందాల సుగుణమ్మ
నా నిండు జబ్బిల్లివే
అందంగా నీకోసం నే కోట కట్టాను
నా గుండె గదులలోనే
వాకిట్లో వయ్యారమా ముద్ద బంతుల్లో ఓ అందమా
నిలువెత్తు బంగారమా ఇంతందం నీకె సొంతమా..
దరిచేరే అందాన్ని దూరంగా చూస్తూ నేనస్సలుండలేనే
ఈ ఎడబాటు ఎన్నాళ్లు నాకింకా ఈ శిక్ష నువ్వెట్టా కలిగిస్తివే
సమయమంటూ ఉంది అది వచ్చే వరకు ఎదురే సూడాలయ్యో
కడదాకా సాగేటి అనుబంధ పయనాన్ని ఓపిగ్గా పొందాలయ్యె
ఈ చెట్టు చేమల మధ్యన మన ప్రేమ గుర్తులే మిగిలెనే
నిండు పున్నమి వెన్నల్లో అందాన్ని ఆరబోయమంటినే
నీ సొగసు పంచమంటినే.. నీ సొగసు పంచమంటినే
మాయ మాటలు చాలురా పిల్లోడా
పొగిడి పొందలేవురా నన్నే
నీకు దక్కని దాన్నిరా
నన్నే ఇడిచి దూరముండరా
వాకిట్లో వయ్యారమా ముద్ద బంతుల్లో ఓ అందమా
నిలువెత్తు బంగారమా ఇంతందం నీకె సొంతమా..
మాట వరసకొచ్చి మందలించి నన్ను మాయచేసి పోతివే
నిన్ను కలిసిన సంధి నిద్దరన్నలేదే లేక నేనాగమైపోతిర
కలువ కన్నుల దాన సక్కని నెరజాణ ప్రాణమైన దానివే
నీతోటి నే బ్రతక గుండెల్లో నాకింత చోటే ఇయ్యవే
నలుపు వెన్నెలతోటి పయనాన్ని సాగించా
నీ తోడుగా వస్తను
ఏ కష్టాలు కనీళ్ళు రానీయకుండా
నిన్ను చూసుకుంటను
పంచ ప్రాణాలు నీకిస్తను.. పంచ ప్రాణాలు నీకిస్తను
వాకిట్లో వయ్యారమా ముద్ద బంతుల్లో ఓ అందమా
నిలువెత్తు బంగారమా ఇంతందం నీకె సొంతమా..
ఓ పిల్ల రసగుల్లా నువ్వు నవ్వితే నా గుండె గుల్ల
తల్లడిల్లే ఎల్లకిల్లా నా ప్రాణమంతా నీ వల్ల
మాయ మాటలు చాలురా పిల్లోడా
పొగిడి పొందలేవురా నన్నే
నీకు దక్కని దాన్నిరా
నన్నే ఇడిచి దూరముండరా