Agamma Agaradhe Radhamma Song Lyrics penned by Kalyan Sumitra, music composed by Venkat Ajmeera, and sung by Boddu Dilip, Battu Shailaja from Telugu cinema ‘Folk song‘.
Agamma Agaradhe Radhamma Song Lyrics: Agamma Agaradhe Radhamma is a Telugu song from the film Folk song starring Hanumanthu, directed by . "Agamma Agaradhe Radhamma " song was composed by Venkat Ajmeera and sung by Boddu Dilip, Battu Shailaja, with lyrics written by Kalyan Sumitra.
Agamma Agaradhe Radhamma Song Details
Movie Name
Folk song (2024)
Director
Star Cast
Hanumanthu
Music
Venkat Ajmeera
Singer(s)
Boddu Dilip, Battu Shailaja
Lyricist
Kalyan Sumitra
Music Label
THAKITA SHOW
Agamma Agaradhe Radhamma Song Lyrics in Telugu
Lyrics Kalyan Sumitra Music Venkat Ajmeera Singers Boddu Dilip, Battu Shailaja Category Telangana Folk Song Lyrics Song Label THAKITA SHOW
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేసావే మందలించి పోతివే, పిల్ల మనసు దోసుకుంటివే
పొద్ధస్తు నా సుట్టు తిరుగుతుంటవు పని పాట లేనట్టు ఆగమైతావు వద్దంటే వినకుండానే నిన్ను ప్రేమించమని అంటవూ
ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే సిత్రాల నా సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే
ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ట ఏం చేస్తవో నీ మాయ మాటలతోన నన్నే మొత్తంగ బంధిస్తవో
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేసావే మందలించి పోతివే, పిల్ల మనసు దోసుకుంటివే
సోయగాల నీ సూపులతో సొమ్మసిల్లంగ ఆ మత్తు జల్లినవే ఇల్లు జాడ మరిసి నీ కోసమే కాపుకాసి ఎదురు చూస్తుంటినే
నన్నింక మెప్పించే నీ ప్రేమలో నీ వైపుకే నన్ను మళ్ళిస్తివే నా నీడ నాతోడు విడిచిపోయెనే నీ తీరుగా నేను నువ్వైతినే
వాగు వంకల తీరు వరి చేల అందాలు మన ప్రేమకే గుర్తులు వాగు వంకల తీరు వరి చేల అందాలు మన ప్రేమకే గుర్తులు
నీకు నాకు మధ్య సాక్ష్యంగా మిగిలేరు ఈ పంచ భూతాలు ఈ పంచ భూతాలు
పొద్ధస్తు నా సుట్టు తిరుగుతుంటవు పని పాట లేనట్టు ఆగమైతావు వద్దంటే వినకుండానే నిన్ను ప్రేమించమని అంటవూ
గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేసావే మందలించి పోతివే, పిల్ల మనసు దోసుకుంటివే
మనసిచ్చిన నీకు మాటిచ్చినానమ్మ మనసారా మనువాడుకుంటానని పది కాలాలు గుండెల్లో దాసుకుంటానే నిన్ను విడిచి ఏడ పోనని
నీ కౌగిట్లో సరసంగ చేరుకొని నా తనువంతా నీకే పంచుకుంట జన్మంతా నీ చెంత ఉండిపోగ నా బతుకంతా నీకే ఇచ్చుకుంట
ఈనాటి అనుబందమేనాటిదో అంటూ మనమిట్ల మురిసిపోగా ఈనాటి అనుబందమేనాటిదో అంటూ మనమిట్ల మురిసిపోగా
జన్మ జన్మాలకే ఇంకా వీడిపోని బంధాన్ని ఆ దేవుడు ముడి వెయ్యగా ఆ దేవుడు ముడి వెయ్యగా