Movie Name | Folk Song (2025) |
---|---|
Director | Yakub |
Star Cast | battushilaja |
Music | Venkat Ajmeera |
Singer(s) | Ranga& Battu Sailaja |
Lyricist | Kannam Srinivas |
Music Label |
ట్యూన్ :- కన్నం శ్రీనివాస్ (Kannam Srinivas)
రచయిత :- నాగరాజు కాసాని (Nagaraju Kasani)
గాయకులు :- రంగా (Ranga) & బట్టు శైలజ (Battu Sailaja)
సంగీతం:- వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
ముద్దు ముద్దు మేన బావా రావయొ
నన్ను మందలించి మలుపుకోర బావయో
ముద్దు ముద్దు మేన బావా రావయొ
నన్ను మందలించి మలుపుకోర బావయో
నా సేయ్యి పట్టు బావో
గోరింట పెట్టు బావో
సుక్కలే అద్దు బావో
సుక్కని ముద్ధాడవో
నా మెల్లో తాలై నువ్వు
నా వొళ్ళో వాలిపోవో
నా కలల రాజు నువ్వు
నిజమయ్యి ఉండిపొవో
ఎన్ని ఏళ్ల బంధమో జానకి
నీతో ఎన్ని యేండ్ల పుణ్యమే జన్మకి
ఎన్ని ఏళ్ల బంధమో జానకి
నీతో ఎన్ని యేండ్ల పుణ్యమే జన్మకి
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
నీ సీత నేనే బావో
రామయ్య ఉండిపోవో
ఏమైనా నీతో ఉంటా
ఏడున్న పక్కనుంట
నీ సేవ జేసుకుంట
నా ప్రేమ పంచుకుంట
నీ ఆలినయ్యి నేనూ
జోళాలి పాడుకుంట
పసి వాడినయ్యినానే జానకి
నీ వసమైపోయినానే మాటకి
పసి వాడినయ్యినానే జానకి
నీ వసమైపోయినానే మాటకి
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
మన బొమ్మల పెళ్ళి
నిజమవ్వాళీ మల్లి
పోలు తిరుగుతుంటే
ఊరు సూడాలి బావా
కాలు తొక్కుతుంటే
భూదేవి ముద్దాడాలి
పచ్చని పందిట్లోన
మనమేకం అయిపోవాలి
అయ్యో ఊరంత పందిరేసి జానకీ
నిన్ను ఊరేగించి తెస్తనమ్మ ఇంటికి
అయ్యో ఊరంత పందిరేసి జానకీ
నిన్ను ఊరేగించి తెస్తనమ్మ ఇంటికి
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో
సిన్న సిన్న సింతల్ల బావయో
నేను సున్నబోయి కూసున్నా రావయో