
| Movie Name | Folk song (2024) |
|---|---|
| Director | Raghu Jaan |
| Star Cast | Dilip Devgan, Varshini |
| Music | Indrajitt |
| Singer(s) | Dilip Devgan, Prabha |
| Lyricist | Dilip Devgan |
| Music Label |
పాట: ఎందిరా ఓరి వెంకటి (Endira Ori Venkati)
గాయకుడు – దిలీప్ దేవగన్ ( Dilip Devgan), ప్రభ (Prabha)
సంగీత దర్శకుడు – ఇంద్రజిత్ ( Indrajitt)
సాహిత్యం – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
నటీనటులు – దిలీప్ దేవగన్ (Dilip Devgan), వర్షిణి (Varshini)
ఆమె: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
అతడు: నిన్ను చూడకుంటే
పాణం ఆగమైతున్నదే ఒంటికి
నిదుర లేదే కంటికి
నిన్న కప్పుకున్న దుప్పటి
నిదుర లేదే కంటికి
నిన్న కప్పుకున్న దుప్పటి
ఆమె: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
సిగ్గులేదేరా వెంకటి
సిరగుంజుతావు దేనికి
సిగ్గులేదేరా వెంకటి
సిరగుంజుతావు దేనికి
అతడు: లగ్గమాడేటోడ్నే నేనే
నంగాతనం దేనికి
నీకు మేనబావని
నెట్టాకే నన్ను పొమ్మని
నీకు మేనబావని
నెట్టాకే నన్ను పొమ్మని
ఆమె: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎహే ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందుకురా వెంకటి
ఫోను కొట్టుడు గంట గంటకి
ఎందుకురా వెంకటి
ఫోను కొట్టుడు గంట గంటకి
అతడు: నీ మాట వినకుంటే
పాణం గాయి గాయి గుండెకి
సొయా లేదే ఒంటికి
జరమొచ్చినట్టు పెయ్యికి
ముద్దియ్యే ఒకటి వెళ్ళిపోతాడు వెంకటి
ఆమె: ఇజాత్తు పోతది వెంకటి
వత్త పోరా మాపటికి
ఇజాత్తు పోతది వెంకటి
వత్త పోరా మాపటికి
అతడు: చెట్టెక్కిన గౌడన్న కళ్ళు తియ్యా ఆగడే
పోనే పోడు వెంకటి
ఏమైనా గాని పూటకి
పోనే పోడు వెంకటి
ఏమైనా గాని పూటకి
ఆమె: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
గోసపెట్టకు వెంకటి
మా అయ్యా వత్తాడు ఇంటికి
గోసపెట్టకు వెంకటి
మా అయ్యా వత్తాడు ఇంటికి
అతడు: మీ అయ్యా వత్తె ఏమైతది
మైల పోలె పూటకి
బండి కడతా ఎడ్లకి
బైలెళ్లు ఇంటికి
బండి కడతా ఎడ్లకి
బైలెళ్లు ఇంటికి
ఆమె: ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
ఎందిరా ఓరి వెంకటి
ఎందుకొచ్చినవ్ ఇంటికి
నా ముద్దుల వెంకటి
మాటింటాడే సంగటి
నా ముద్దుల వెంకటి
మాటింటాడే సంగటి
అతడు: ఇక పోతున్న పోతున్న
మరిచిపోకే మాపటికి
గౌన్ల అరటి తోటకి
వచ్చి పోవే ఆడకి
గౌన్ల అరటి తోటకి
వచ్చి పోవే ఆడకి
ఆమె: గౌన్ల అరటి తోటకి
వత్త పోరా ఆడికి
గౌన్ల అరటి తోటకి
వత్త పోరా ఆడికి
Endira Ori Venkati song is from the Folk song movie.
Endira Ori Venkati song was sung by Dilip Devgan, Prabha.
Endira Ori Venkati song lyrics were written by Dilip Devgan.
Endira Ori Venkati song music was composed by Indrajitt.