Movie Name | folk song (2025) |
---|---|
Director | SAIKRISHNA_DANCEHOLIC |
Star Cast | Likhitha & Karunakar |
Music | |
Singer(s) | Srinidhi & Suman |
Lyricist | Raghu Nimmala |
Music Label |
Production Name: KDS - Krazy Dance Studios
Lyrics & Tune: Raghu Nimmala
Singers: Srinidhi & Suman
Music: In The Mix Studios [ 9502601988 ]
Casting: Likhitha & Karunakar
Direction & Choreography: SAIKRISHNA_DANCEHOLIC
Editing & DI: Btwitsram [ Ramu ]
Poster: Nandu
DOP: Sunny Bethi
Drone: Raju
Makeup: Makeover by Pranitha
Outfit: SSSPARKCART_Asha
Digital Marketing: Latha
అలనాటి అందాల తారవో
నా శతకోటి ఆశల రాణివో
మురిపాల ముత్యాల తోడువో
నా పరువాల ఈడుకు జోడువో
అరుదైన సొగసుల సింగారివమ్మా
మనసైన మధురాల వయ్యారి బొమ్మ
తనువంతా తలిచేది నీ నామమేగా
కనిపెట్టుకోలేవా ఈ సిగ్గు బాష
చాలమ్మ చాలమ్మ ఈ ఒక్క మాట
నీ కన్నే పాదాల పారాణినైత
రాయే నా వలపుల గంధమా
నా వరసైన వందేళ్ల బంధమా
ఆ పంచభూతాల సాక్షిగా
ఏకమవ్వాలి నువ్వు నేను జంటగా
ముక్కోటి దేవుళ్ళను మొక్కుకుంటుననే అమ్ములు
నీ తాళి బొట్టును నీ కాలి మెట్టెను అయితను నేనెప్పుడూ
అయ్యయ్యో ఆరాటము అర్ధమయిందిలే తాపము
నా అయిదోతనమంతా నీ తనువు ఏనాడో అయిందిలే సగభాగము
ఏడున్నావే నువ్వు నా ఎన్నెలమ్మ
ఎడబాటు చాలు ఎన్నేళ్లు ఇంకా
ఎంతెంత దూరంగా మనమంతా ఉంటే
అంతంత మన మంచికే మంచిదం
చాలమ్మో చాలమ్మ ఈ ప్రేమ జూదం
నాతోని కాదమ్మో ఈ దూర భారం
రాయే నా వలపుల గంధమా
నా వరసైన వందేళ్ల బంధమా
ఆ పంచభూతాల సాక్షిగా
ఏకమవ్వాలి నువ్వు నేను జంటగా
ఏ మంత్రం వేసినవో నా మనసంతా దోచినావు
సావైన బతుకైనా నీ వెంటే ఉండాలంటున్నదే ప్రాణము
ఎన్నెన్ని అడ్డంకులో నిన్ను చేరేటి నా గుండెకు
ఎట్లైతే గట్లాయే అనుకోని కొట్లాడితే నువ్వు దక్కినావు
నీకంత సీనైతే లేదనుకున్నా
దేవుని దయవలన నీ పెళ్లామైనా
అట్లుంటదే పిల్ల మా వంశం అంటే
అనుకుంటే ఏదైనా ఈడిచేదే లేదే
ఏదున్నా లేకున్నా నువ్వుంటే చాలే
గుటుక కూడు తిన్న సంతోషమేలే
రాయే నా వలపుల గంధమా
నా వరసైన వందేళ్ల బంధమా
ఆ పంచభూతాల సాక్షిగా
ఏకమవ్వాలి నువ్వు నేను జంటగా