
| Movie Name | Folk song (2022) |
|---|---|
| Director | |
| Star Cast | Ramu Rathod |
| Music | Kalyan Keys |
| Singer(s) | Ramu Rathod |
| Lyricist | Ramu Rathod |
| Music Label | M S ADDA |
| Lyrics | Ramu Rathod |
| Music | Kalyan Keys |
| Singer | Ramu Rathod |
| Category | Telangana Folk Song Lyrics |
| Song Label | M S ADDA |
అతడు: కంటికి కునుకే కరువాయెనే
గుండెల బరువే మొదలాయెనే
అతడు: సొమ్మసిల్లి పోతున్నవే
ఓ సిన్నా రాములమ్మ
చెమ్మగిల్లి ముద్దియ్యవే
చూపించవే నాపై ప్రేమ
అతడు: నల్ల నల్లాని కళ్ళతో
నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివే
గుండె గాలిలో తేలుతు
ఆరాటలాడుతూ నీ ఒళ్ళో నే వాలెనే
సుట్టు దిప్పుకున్నావే
ఓ సిన్నా రాములమ్మ
సెమట సుక్కోలే తీసెయ్యకే
నీ సీర కొంగుకే ముడివెయ్యవే
అతడు: సాయంకాలం వేళ
సందె పొద్దులాగ సెంతలోనే ఉండవే
సీకటేల మెరిసే సుక్కలాగ గుండెలోన దాగవే
నీటిలోన నీడ చూస్తుంటే
ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే
నీ చేతినద్దేసి కలలన్ని చెరిపేసి
కాలాన్ని మార్చకే
అతడు: ఎక్కడున్నా ఎదురయ్యే
నీ సన్నజాజి నవ్వులే
సక్కనైన సొగసులే
నాకిచ్చి స్వర్గంలో బంధించవే
అతడు: ఏటి గట్టు మీద ఎదురుసూపుల్లోన
కళ్ళల్లో నిండినవే
గాలివానల్లోన గొడుగల్లే
రమ్మన్న వెచ్చగా కౌగిలికే
అతడు: నీ ఊహలే కన్న నీ ధ్యాసలో ఉన్న
నా దరికి రమ్మంటినే
నిను వెతికే దారుల్లో అడ్డంకులెన్నున్నా
నా అడుగు నీ జాడకే
ముద్దుగున్నా నా చెలివే
ఓ సిన్నా రాములమ్మ
సెంత సేరే రోజెన్నడే
ప్రాణం అల్లాడే నీకోసమే
అతడు: పారేటి సెలయేరు పలకరించకున్నా
పరువాలేదనుకుంటినే
ప్రాణం కన్నా నువ్వు ఎక్కువ అంటున్నా
పట్టించుకోవెందుకే
అతడు: పువ్వుల్లో దాగున్న పరిమళాలన్నీ
నీ చెంత చేరిస్తినే
పంచభూతాలన్నీ సాక్షులుగా ఉంచేసి
మనువాడుకుంటానులే
అతడు: జన్మ జన్మాల బంధానివే
ఓ సిన్నా రాములమ్మ
నా సీకటి బ్రతుకుల ఎలుగియ్యవే
నా ఇంటి దీపాన్ని ఎలిగించవే
Somma Silli Pothunnava song is from the Folk song movie.
Somma Silli Pothunnava song was sung by Ramu Rathod.
Somma Silli Pothunnava song lyrics were written by Ramu Rathod.
Somma Silli Pothunnava song music was composed by Kalyan Keys.