Movie Name | Folk Song (2022) |
---|---|
Director | |
Star Cast | RAMURATHOD, DIVYA BHAGAT |
Music | KALYAN KEYS |
Singer(s) | DIVYA MALIKA - RAMU RATHOD |
Lyricist | RAMU RATHOD |
Music Label |
Singers: Divya Malika & Ramu Rathod
Music: Kalyankeys
Lyrics: Ramu Rathod
ఆమె: ఎన్నాళ్ళదో ఈ బంధము
ఏకమవ్వాలి ఈ నిమిషము
ఆగనంటోంది నా ప్రాణము
ఇకపై నీతోనే నా పయనము
ఆమె: నిన్ను సూడక ఇన్నాళ్లు
సూసాక నా కళ్ళు
సంద్రాన్ని తలపించేరా
రేపు ఉండేటి నా ఇల్లు
అవ్వాలి హరివిల్లు
నీ నీడలో హాయిరా
ఆమె: నాలోని ఈ బాధను
నీకు పంచాలి నా ప్రేమను
నాతో ఉండేటి ప్రతి జన్మను
నీకు రాసిస్తే నే ధన్యము
ఆమె: నీలోని ప్రేమంతా… నాలోనే దాచుంచ
నా మనసు గెలిచినోడా
నీతో నా గుర్తులు… పదిలాంగానే ఉంచా
నా ఏలు వట్టేటోడా
ఆమె: నిదురలోన కూడ నీ పేరే నే తలిచా
నా కంటి రెప్పైనోడా
నీతోనే దూరంగా నేనుండ లేనంటూ
నీ సెంత సేరానురా
ఆమె: నన్నెలుకో నా దొరా
ఊపిరావుతాను నీకురా
నువ్వే లేక నేనురా
నాలోని ప్రాణమే నీవురా
ఆమె: ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని
నే చూడలేకున్నారా
కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే
నా ఒళ్ళు పులకరించే చూడరా
ఆమె: ఏనాటికీ నేను నీ ఎదురు సూపును
మరువనే మరువనురా
ఎల్లవేళలా నువ్వు నా కోసం
తపియించినావు గనకే మురిసారా
ఆమె: కలలోనైనా కనలేదురా
కానుకల్లే కలిసావురా
కడదాక నీతో నేనురా
కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా, ఆ ఆ
అతడు: సిననాడు నీ ఎంట తిరిగేటి
ఆ వింత సిత్రమై గురుతున్నాదే
సూడసక్కనిదంట మన ఇద్దరి ఈ జంట
పండెనే మన పంటనే
అతడు: ఇంక సాధించిన మన ప్రేమ
సిక్కులు రాకుండా సల్లంగా వర్ధిల్లనే
ఇకపైన సచ్చేదాకా నీతో తోడుగుండి
మన ప్రేమను బ్రతికిద్దామె
అతడు: అమ్మోలే లాలించవే
నాన్నోలే తోడుంటనే
కంటి పాపోలే కాపుండవే
చంటిపాపోలే నిను జూత్తనే