Movie Name | love failure song (2025) |
---|---|
Director | Raj Narendra |
Star Cast | Vaishnavi Sony, Tony Kick |
Music | Madeen SK |
Singer(s) | Ram Adnan & Brinda |
Lyricist | Suresh Kadari |
Music Label | Oormi Love Songs |
చిననాటి ప్రేమ చితిమంటలోనా
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
కాదంటు పోతున్నదే…
కడదాక తోడంటు కన్నీరు ఇచ్చి
కనుమరుగే ఐతున్నదే
సెలవంటు సెయ్యిడిసి సినసూపు జూసి
సిత్రంగ పోతున్నదే
సావంచు దారుల్లో నా ప్రేమనీ
సంపేసి పోతున్నదే
మరిచావ మరిచావ నా ప్రేమనూ
మనసిచ్చి కాదంటే ఏమవ్వనూ
దాచావ దాచావ నీ మనసును
దూరంగ నువ్వుంటె ఎటు పోదునూ…
చిననాటి ప్రేమ చితిమంటలోనా
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
కాదంటు పోతున్నదే…
ఆ: ఆఆ ఆ ఆ ఆ ఆఆ
నా గుండె పైన నీ రూపు గీసి
మనసార ప్రేమించినా
కాలాన్ని మరిచి నిన్నే తలచి
నీ వెంట అడుగేసినా
నీతోడు నీడల్లే నీ వెంట ఉండి
నా ప్రేమనే పంచినా
నీ కంట కన్నీరు రానియ్యకా
కనుపాపయి కాచినా
మంటల్లో కాల్చావు నా ఆశను
గాయాలే చేసావు నా గుండెను
మరిచావ మరిచావ నా ప్రేమనూ
మనసిచ్చి కాదంటే ఏమవ్వనూ
దాచావ దాచావ నీ మనసును
దూరంగ నువ్వుంటె ఎటు పోదునూ…
చిననాటి ప్రేమ చితిమంటలోనా
చీకటే అయితున్నదే
నా ప్రేమ మరిసి ఒంటరిగ ఇడిసి
కాదంటు పోతున్నదే…
ఆ: నా నుదుటిపైనా తిలకాన్ని దిద్దే
రామయ్య నువ్వేనురా
నా మెల్లో పసుపుతాడును కట్టే
కన్నయ్య నువ్వేనురా
నాలోన సగభాగమైనట్టి
ఓ శివుడివే నువ్వేనురా
నా పంచప్రాణాల అధికారివి
నువ్వే మనసారా
ఎవరేమి అనుకున్న నిను వీడను
ప్రాణాలు పోతున్న నిను మరువను
వస్తున్న వస్తున్న నీ సెంతకే
ఇల్లాలు అవుతాను నీ ఇంటికే
వస్తున్న వస్తున్న నీ సెంతకే
జంటై ఉంటాను ఈ జన్మకే.