Movie Name | Love failure song (2022) |
---|---|
Director | |
Star Cast | Tony Kick |
Music | Madeen Sk |
Singer(s) | Ramu & Divya malika |
Lyricist | Rajender Konda |
Music Label |
Music Director : Madeen Sk Lyrics : Rajender Konda Dop,Editing&Di : janatha Bablu Singers : Ramu & Divya malika SPL Thanks to Bullettu bandi Laxman & Rl team
కలిసున్న మనరోజులే
కన్నీరోలే మిగిలున్నయే
ఏలు పట్టిన ఆ రోజులే
ఎంట రానన్న బాగుండునే
ఆశలెన్నో పెడితి నీ మనసుకి
నా మాట మూగబోయెనే
నా సక్కనోడివన్న ఆ మాటలే
నా గుండెకు గురుతున్నయే
ఎందుకమ్మ ఇంత బాధనున్న
మనసులో మాటెట్ల దాచావులే
బాగుంది బాగుందే
నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా
ఈ బాధ నాకుందే
నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా
బాగుంది బాగుందే
నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా
ఈ బాధ నాకుందే
నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా
కారులేమి నాకు వద్దురా
మేడలల్లో నేను ఉండరా
పూరిగుడిసె నీకున్న నీతోనే
ఏడుజన్మలైన నవ్వుతూనే ఉంటా
ఉన్న కాడే నేను ఉండలే
నిన్ను సూడకుండ లేనులే
నిన్ను మరిసి పెండ్లి జేసుకొని
మేడలల్ల ఎట్ల ఉంటారా
నాన్నలాగే నిన్ను పిల్సుకున్న
రోజులన్ని యాదికున్నయో
నన్ను నమ్మిన ప్రాణమే నువ్వనుకుంటివి
నీతోనే నేనుంటనో
సూడలేనే పిల్ల నీ కంట్లో కన్నీళ్లు
నీ తట్టుకోలేనులే..!
బాగుంది బాగుందే
నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా
ఈ బాధ నాకుందే
నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా
బాగుంది బాగుందే
నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా
ఈ బాధ నాకుందే
నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా
పారాణి పాదాలకెట్టి
పందిట్లో నే కూసుంటే
పంచపానమెల్లిపాయే
నువ్వు మళ్ళి వస్తవని
ఆశతోనే ఉన్న
అన్ని మర్సి మంచిగున్నవన్న
మాటనెట్ట అంటివి నీ నోట
తల్లిప్రేమ లెక్క జూసుకున్న
నీ ప్రేమనే ఇడిసి నేనిట్ల ఉందున
ఎడబాసిపోయెర ఎండమావిలెక్క
చిగురించి ఉండవులే
నే కడసారి బతిమాలి
నీతోనే ఉంటార ప్రేమించే నీ దానిని
మనసిచ్చి నా మనసే దూరమైతానంటే
నిన్నిడిసి నేనెట్లా మర్సిపోయి ఉందునే
బాగుంది బాగుందే
నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా
ఈ బాధ నాకుందే
నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా
బాగుంది బాగుందే
నా సుట్టుముట్టున్న ఈ సందడిల్లా
ఈ బాధ నాకుందే
నే నెళ్లకాలమిట్ల ఉండలేనుల్లా