| Movie Name | Oh Baby (2019) |
|---|---|
| Director | B. V. Nandini Reddy |
| Star Cast | Samantha Akkineni, Naga Shaurya, Rajendra Prasad, Rao Ramesh |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Nutana Mohan |
| Lyricist | Bhaskarabhatla |
| Music Label | Aditya Music |
మహాద్భుతం కదా
అదే జీవితం కదా
చినుకు చిగురు కాలువ కొలను
అన్ని నువ్వేలే
అలలు శిలలు కళలు తెరలు
ఏవైనా నువ్వేలే
ప్రశ్న బదులు హాయి దిగులు
అన్ని నీలోనే
నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే
అలా ఆ క్షణమే చూపిస్తుంటుంది
ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే
ప్రతి రోజు రాదా వసంతం
ఆనందాల చది చప్పుడు
నీలో నాలో ఉంటాయేప్పుడు
గుర్తే పట్టక గుక్కె పెడితే
లాభం లేదే
నీకే ఉంటె చూసే కన్నులు
చుట్టూ లేవా ఎన్నో రంగులు
రెప్పలు మూసి చీకటి అంటే కుదరదె
ఓహ్ కాలమే నేస్తమై
నయం చేస్తుందే గాయాల గతాన్నీ
ఒహోహోహో ఓహో
అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వి
సంతోషాల తీరం పోదాం భయం దేనికి
పడుతూ లేచే అలాలే కాదా నీకే ఆదర్శం
ఉరుమొ మెరుపొ ఎదురే పాడనీ
పరుగాపకు నీ పయనం
తీపి కావాలంటే చేదు మింగాలంటే
కష్టమొచ్చి కౌగిలిస్తే హత్తుకో ఎంతో ఇష్టంగా
కళ్ళే తడవని విషాదాలని
కళ్ళే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూతే కట్టుకు పోయేదెవరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కళ్ళే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కళ్ళే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా
కళ్ళే తడవని విషాదాలని
కళ్ళే తడపాని సముద్రాలని
కలలోనైనా చూసేటందుకు వీలుంటుందా
చుట్టం చూపుగా వచ్చామందరం
మూటే కట్టుకు పోయేదెవరం
ఉన్నన్నాళ్ళు ఉందాం ఒకరికి ఒకరుగా