| Movie Name | Oh Baby (2019) |
|---|---|
| Director | B. V. Nandini Reddy |
| Star Cast | Naga Shourya,Samantha Ruth Prabhu |
| Music | Mickey J Meyer |
| Singer(s) | Nuthana |
| Lyricist | Bhaskarabhatla Ravi Kumar |
| Music Label | Aditya Music |
With The Rhythm In Your Feet
And The Music In The Soul
Lift Your Hands To The Sky
And Say Ganesha
He’S Your Friend
When You Need
He’S The Magic
In Your Beat
Lift Your Hands To The Sky
And Say Ganesha
నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్న సందేహంలోనా
నా ఎండమావి దారుల్లో
నవ్వులు పూసే
నా రెండుకళ్ల వీధుల్లో
వెన్నెల కాసే
నా గుండె చూడు తొలిసారి
గంతులు వేసే
ఆ నిన్నల్లో మొన్నల్లో
కలలన్ని సడి చేసే
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్న సందేహంలోనా
ఇంత గొప్పగుంటుంద జీవితం
ఇంద్రధనస్సు మెరిసినట్టుగా
తిరిగివచ్చి చేరుకుంటే నా గతం
తెలుసుకొంటోంది మనసేమో మెలమెల్లగా
ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి
సంకెళ్లు తెగినట్టుగా
గుండేపాట గొంతుని దాటి
పెదవుల తీగలపై మోగెనుగా
ఎన్నెన్నో స్వరాలుగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమని పారిపోయే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
లోకమంతా కొత్త కొత్తగుందిగా
పూల చెట్టు దులిపినట్టుగా
ఈ క్షణాన్ని పట్టుకుంటే గట్టిగా
తల్లి వెళుతుంటే
ఆపేసి పసిపాపలా
తీరిపోని సరదాలన్నీ
తనివి తీరేలా తీర్చేసుకోవాలిగా
ఆశలన్నీ దోసిట నింపి
సీతాకోకలుగా వదిలేస్తే
ఆనందం వేరు కదా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా
చాంగుభళా ఇలాగ
నేను ఎలా మారిపోయి
చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనే తూనీగ
తిరిగి వచ్చే నిజంగా
With The Rhythm In Your Feet
And The Music In The Soul
Lift Your Hands To The Sky
And Say Ganesha
He’S Your Friend
When You Need
He’S The Magic
In Your Beat
Lift Your Hands To The Sky
And Say Ganesha