Movie Name | Ala Modalaindi (2011) |
---|---|
Director | Nandini Reddy |
Star Cast | Nani & Nitya Menon |
Music | Kalyani Malik |
Singer(s) | Kalyan Malik,Geetha Madhuri |
Lyricist | Ananta Sriram |
Music Label | Aditya Music |
ఇన్నాళ్లు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
ఎలా ఎలా క్షణాలని వెనక్కి రప్పించడం
ఎలా ఎలా గతాలనే ఇవాళగా మార్చడం ఉమ్ ఉమ్
ఇన్నాళ్లు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే
చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని
చివరి దాకా చెలిమి పంచె చిలిపి తనమే నీవని
మనసు దాకా చెర గలిగే మొదటి పిలుపే నీదని
తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో
తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా ఆఆ ఆఆ హ్మ్ హ్మ్
ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని
ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని
ఎదురు చూస్తూ ఉండి పోనా నేను ఇక పైన
జ్ఞాపకాన్నై మిగిలిపోనా నేను ఎన్ని నాళ్ళయినా ఇలా ఆఆ ఆఆఆ అఅఅఅఅఅ