| Movie Name | Samarasimha Reddy (2026) |
|---|---|
| Director | B. Gopal |
| Star Cast | Balakrishna, Anjala Zaveri, Simran |
| Music | Mani Sharma |
| Singer(s) | Udit Narayan, Sujatha |
| Lyricist | Sirivennela Seetarama Sastry |
| Music Label | Aditya Music |
ఆ హా ఆ ఆఆ… ఆ హా ఆ ఆఆ
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది… రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది… కవ్విస్తే కట్టు తప్పనా
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మా
అట్టాగా చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
ఇయ్యాయియే ఇయ్యాయియే ఇయ్యాయియే యే హే
ఇయ్యాయియే ఇయ్యాయియే ఇయ్యాయియే యే హే
చెప్పుకుంటే తప్పులేదే… ఉప్పు తిన్న నీ ఒంటి యాతనా
తప్పుకుంటే ఒప్పుకోదే… నిప్పులాంటి నీ కొంటె వేదనా
నేనుంది అందుకేగా… ఏమైంది ఇంతలోగా
కానుంది మంచిదే ఎలాగా
కాబట్టి కందిరీగ… నీ కాటు అందుకోగా
లేచింది వన్నె కన్నె తీగా
వందేళ్ల సందిళ్ళ పందిళ్ళు వేయించన
అందాల అడ బొమ్మ… ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ… కందిపోతుంది కన్నె జన్మ
ఆ హా ఆ ఆఆ… ఆ హా ఆ ఆఆ
సున్నితంగా చూసుకుంటే… సొమ్ములన్ని నీ చేతబెట్టనా
నిబ్బరంగా నమ్ముకుంటే… కౌగిలింత నే మూతబెట్టనా
వంపుల్ని లెక్కబెట్టి… ఒక్కొక్క ముద్దు పెట్టి
నీ ప్రేమ నారు నాటి పోయా
ముద్దుల్లో నానబట్టి… ఒళ్ళంతా పూతబట్టి
నిలువెల్లా మల్లెతోట కావా
గంధాలు చిందేల అందాలు పండించవ
అందాల అడ బొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ
అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ
పుచ్చెడ కొనల్లోన కన్ను చిక్కుకుంది… రక్షించు నన్ను చప్పున
గుప్పెల్లో దాటుతున్న గుట్టు గుప్పుమంది… కవ్విస్తే కట్టు తప్పనా