Movie Name | FOLK SONG 7 (2025) |
---|---|
Director | SADIK MD |
Star Cast | BUNNYYADAV - NITHU QUEEN |
Music | KALYANKEYS |
Singer(s) | RAMURATHOD/DIVYAMALIKA |
Lyricist | SAI KRISHNA VEMULA |
Music Label |
గాయకుడు: రాము రాథోడ్ (Ramu rathod) దివ్యమాలిక (Divyamalika)
సంగీతం: కళ్యాణ్ కీస్ (Kalyan key”s)
సాహిత్యం: సాయికృష్ణ వేముల (Saikrishna vemula)
నటీనటులు : బన్నీ యాదవ్ (Bunny yadav), నీతు క్వీన్ (Nithu queen)
దర్శకుడు: బాలు SM (BALU SM)
నిర్మాత : బన్నీ యాదవ్ (Bunny yadav
నీకోసమే పుట్టినరా నీ ప్రేమకు బానిసనైతినిరా
చూపులల్లా సిక్కినరా నీ నవ్వుల్లా లోకాన్ని మరిసినరా
నా గుండెల్ల నీ రూపు గీసినరా
నీ ఊపిరి నేనై చేరుతరా
వేళ ఆశలు నీపైన దాచినరా
కోటి జన్మలు నీ వెంట సాగుతరా
నీవెంట…! నీవెంట…!
ఏడు అడుగులు నడిచివస్తారా….!
ఏడేడు జన్మలు తోడుగుంటారా….!
గుండె గుళ్ళోన దాసుకున్నారా….!
కంటి పాపోలే చూసుకుంటారా….!
నీకోసమే పుట్టినరా నీ ప్రేమకు బానిసనైతినిరా
చుట్టూ ఎంత మంది చేరినా నేను తలిచేది నీ పేరునే
ఎంత గొప్ప ఇంట పుట్టినా అడుగు పెట్టేది నీ ఇంటనే
ఆ రామయ్యకే మొక్కినా నీ సీత నేనైతానని
ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఇష్టంగా నీతోనే ఉంటానని
ఏ జన్మకైనా నీ జంటగా నడిచొస్తాను నీ నీడనై
చావునైనా నిన్ను ఇడిచిపోను కలిసి ఉంటాను నీదానినై
ఏడు అడుగులు నడిచివస్తారా….!
ఏడేడు జన్మలు తోడుగుంటారా….!
గుండె గుళ్ళోన దాసుకున్నారా….!
కంటి పాపోలే చూసుకుంటారా….!
నీకోసమే పుట్టినరా నీ ప్రేమకు బానిసనైతినిరా
ఓ నవ్వు నువ్వు ఇసిరితే మనసు మబ్బుల్లో తేలిందిరా
నీ మాటలెల్లా మునిగితే రోజొక్క నిమిషము లాగొందిరా
ఆ దేవుడొచ్చి చెప్పినా నిన్ను మరిచి బతకలేనురా
ఏ అడ్డు గోడ కట్టినా ప్రాణమిచైనా దాటొస్తారా
నువ్వు దక్కకుంటే ఉన్న ఊపిరైనా నాకు ఏందుకంటారా
వదులుకొని నిన్ను మరువలేను నీకు పాప లెక్క పుడతారా
ఏడు అడుగులు నడిచివస్తారా….!
ఏడేడు జన్మలు తోడుగుంటారా….!
గుండె గుళ్ళోన దాసుకున్నారా….!
కంటి పాపోలే చూసుకుంటారా….!
నీకోసమే పుట్టినరా నీ ప్రేమకు బానిసనైతినిరా
ఏ జన్మదో ఈ బంధము నా సొంతమైనది నీ అందము
రానివ్వను ఏ కష్టము కడదాకా సాగాలి నీ స్నేహము
నా చేతికి చిక్కిన జాబిలివే ఈ చేతిలో గీతల్లే మారినవే
నా ప్రేమకు దక్కిన బహుమతివే
నా గడపలో కుడికాలు పెట్టిరావే
పెట్టిరావే…! పెట్టిరావే…!
సిన్ని మూడు ముళ్ళేసుకున్నానే….!
సిన్ని ముద్దుగా చూసుకుంటానే…!
సిన్ని గుండెల్ల ఊపిరి నేనై …!
సిన్ని ఏనాడు ఇడిచెల్లిపోనే…!
ఏ జన్మదో ఈ బంధము నా సొంతమైనది నీ అందము