Vintunna O Pilla Song Lyrics - Folk song = 9

Vintunna O Pilla Song Lyrics - Folk song = 9
Vintunna O Pilla Song Lyrics penned by Laxman, music composed by Madeen Sk, and sung by Suman Badanakal & Srinidhi from Telugu cinema ‘Folk song = 9‘.
Vintunna O Pilla Song Lyrics: Vintunna O Pilla is a Telugu song from the film Folk song = 9 starring Akshith Marvel & Sri Ravula Charry, directed by Bullet Bandi Laxman. "Vintunna O Pilla" song was composed by Madeen Sk and sung by Suman Badanakal & Srinidhi, with lyrics written by Laxman.

Vintunna O Pilla Song Details

Movie NameFolk song = 9 (2025)
DirectorBullet Bandi Laxman
Star CastAkshith Marvel & Sri Ravula Charry
MusicMadeen Sk
Singer(s)Suman Badanakal & Srinidhi
LyricistLaxman
Music Label

Vintunna O Pilla Song Lyrics in Telugu

లేవే నువ్వు నిద్దురా ఓ పిల్ల ఓ ఊర్మిలా
వనవాసం గెలిచి లచ్చమయోచ్చినాడిలా
ఎన్నేళ్ళ నిద్దురా తీరిందే నీ కల
మంచి నీళ్ళుద్దురా ఎదురుండే నీ దొర
ఎదురు చూపులకు ఎర్రగైనవి కళ్ళు
ఎదబారాలకు బక్కదైనది ఒళ్ళు
కడిగినవి కన్నీటితో తన పాదాలు
చేతి కందియు పళ్ళు

వింటున్నా ఓ పిల్ల ఎనెన్ని బాధల్లా
పడ్డంకా ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా
వింటున్నా ఓ బావ ఎన్నెన్ని దుఃఖాలే
దిగమింగి ఒక్కటైతున్నామే నువ్వు నేనిలా

కోపమొచ్చి మాటలంటనే
చేయిలేపి దెప్ప కొడతనే
అలిగి నువ్వు ఫోను చేద్దూవమ్మా తెల్లారి నువ్వే

కొట్టినా నువ్వే కదనే
తిట్టినా నువ్వే కదనే
కందినా నా మనసుకు మల్ల మందు నువ్వేనే

మన బాధలన్నీ రాయవోతే పల్లవి
కన్నీల్లే రాసుకున్నవి చరణాలవి
కన్నిలేందుకే ఓ పిల్ల పల్లవి
ఈ లచ్చుమయ్య గుండెలుపిరున్నది

నా మనసులోని మాట నీకెట్టా సెప్పాలంటూ
మోమాటంతో నలుగుతూ ఉన్న వేళలో
నీ సిగ్గుపాడుగాను సిన్నబోయి బోయి నేను
చెప్పేశా దూరమైతావాని మనసుల మాట

అమావాస్య చీకట్లో చందమామలా..
తెచ్చావే నా బతుకుల దీపాల పండుగా
ఒడి అలిసిన నా గుండెకు గెలుపంటే నువ్వేగా

ఆ సంబురాన్నే రాయవోతే పల్లవి
మన సంతోషాలే రాసేనే చరణాలవి
నీకు కన్నిలేందుకే ఓ పిల్ల పల్లవి
ఈ లచ్చుమయ్య గుండెలుపిరున్నది

ఇచ్ఛ నీకో మాట అందరోప్పుకున్నోనైత
పది మంది మెచ్చేలా మెల్లోన పుస్తెను గడుతా
నిలబెట్టుకున్న మాట మెచ్చుకునేలా ఊరంతా
సాదించానయ్యా చదువుతోనే కొలువును నేనే

నా సిన్న సిన్న తప్పులను మన్నించినావే
నా పెద్ద పెద్ద ఆశలను గెలిపించినావే
వెన్ను పూసై నా వెనకనున్నవే..

నీ త్యాగాలనే రాయవోతే పల్లవి
మారిన నా రాతనే చరణాలవి
కన్నిలేందుకే ఓ పిల్ల పల్లవి
ఈ లచ్చుమయ్య గుండెలుపిరున్నది

రాజును నేను గానే కోటలు నాకు లేవే
నాకున్నంతలో మారాణోలే నిన్ను చూస్తానే
కోటలు మేడలేంది నీ నీడలంటే చాలే
నిన్ను పూస్తే మెట్టల పెట్టుకొని మురిసిపోతనే

మన ఆశలన్నీ అక్షింతలయెనే
ఆనందాలే నా కళ్ళలో నీళ్లై జారెనే
ఎదురు చూపులు ఇన్నాళ్లకు పెళ్లి చూపులాయెనే

నీ మెళ్ళో పూస్తే గడుతావుంటే పల్లవి
నా జల్లో పూలె పూలదండలైనవి
నీతో ఏడడుగులు వేస్తా ఉంటే పల్లవి
చూసి ముల్లోకాలే మురిసిపోయినవి

 

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk song = 9 Movie

  1. Vintunna O Pilla Song Lyrics