Suddala Ashok Teja Yavathi Ra Corona Song Lyrics - Etv Network

Suddala Ashok Teja Yavathi Ra Corona Song Lyrics - Etv Network
Suddala Ashok Teja Yavathi Ra Corona Song Lyrics: Suddala Ashok Teja Yavathi Ra Corona is a Telugu song from the film Etv Network. "Suddala Ashok Teja Yavathi Ra Corona" song was composed by Yasho Krishna and sung by Sai Charan, Yasho Krishna. Lyrics were written by Dr. Suddala Ashok Teja.

Suddala Ashok Teja Yavathi Ra Corona Song Details

Movie NameEtv Network
Director
Star Cast
MusicYasho Krishna
Singer(s)Sai Charan, Yasho Krishna
LyricistDr. Suddala Ashok Teja
Music LabelETV Dhee

Suddala Ashok Teja Yavathi Ra Corona Song Lyrics in Telugu

ఎవతిరా ఇది ఎవ్వతిరా… ఈ కరోనా రక్కసి ఎవ్వతిరా…

ఎంతదిరా ఇది ఎంతదిరా… మనసంకల్పం ముందెంతదిరా…||2||

కేంద్ర రాష్ట్ర సర్కార్ల అండతో ఢీ అంటూ జేగంటలు కొడతాం…

సమసామాజ జోతిర్గమయ అంటూ దీపమెట్టి వైరస్ తరిమేస్తాం…

ఎవతిరా ఇది ఎవ్వతిరా… ఈ కరోనా రక్కసి ఎవ్వతిరా…

ఎంతదిరా ఇది ఎంతదిరా… మనసంకల్పం ముందెంతదిరా…

అవ్వతోడు తెగ కొవ్వు బలిసి ఇది తొవ్వ తప్పి మువ్వెన్నెల జండా…

యవ్వన భూజన ప్రాణ దివ్వెలతో గవ్వలాడుటకు కాలుదువ్వినది…

గవ్వలాడుటకు కాలుదువ్వినది… గవ్వలాడుటకు కాలుదువ్వినది…

చెయ్యి కలిపితే దయ్యమవుతది… నోటి తుంపరతో అంటుకుంటది…

భయ్యా… అరె భయ్యా … అరె భయ్యా …

దీన్ని మసి చెయ్యాలంటే చెయ్యి కలపకనే… ఒక్క తాటిపై

నమస్కారమనే కత్తితో కరోనా గొంతు కొయ్యవలె… అంతు చూడవలె

గొంతు కొయ్యవలె… అంతు చూడవలె… గొంతు కొయ్యవలె… అంతు చూడవలె

ఎవతిరా ఇది ఎవ్వతిరా… ఈ కరోనా రక్కసి ఎవ్వతిరా…

ఎంతదిరా ఇది ఎంతదిరా… మనసంకల్పం ముందెంతదిరా…

గడప దాటక ఉండి కరోనా గండానికి ఇక పిండం పెడదాం…

గజం గజం దూరం పాటిస్తూ కరోనాతో వంతెన తెగ్గొడదాం…

మనలో మనకు జబ్బుందని తెలిస్తే.. నూట నాలుగు (104)కు ఫోన్ కొట్టుదాం…

క్వారంటైన్ కు వెళ్ళి భారత జాతి ఆయుష్షుకు గారంటీ ఇస్తాం…

ప్లేగు పేగు తెంపేసిన ఘనులం… గత్తరను తొడగొట్టి తరిమినం…

మత భేదాలను…. హు హు హు

మత భేదాలను విడిచి కరోనాను ఖతం చేసి దుర్గతిని మాపుతాం…

ఎవతిరా ఇది ఎవ్వతిరా… ఈ కరోనా రక్కసి ఎవ్వతిరా…

ఎంతదిరా ఇది ఎంతదిరా… మనసంకల్పం ముందెంతదిరా…

తమ ప్రాణాలను గడ్డిపోచవలె భావించే వైద్యులకు, నర్సులకు…

ఆలుబిడ్డలను మరచి సేవలో అలుపెరుగని పోలీసు బిడ్డలకు…

మురికిలోన మురికయ్యి బతుకులను పణం పెట్టె మన సఫాయోళ్లకి

నిరంతరం చైతన్యపరిచే ప్రెస్సు మీడియా మార్గదర్శులకు…

ప్రణామంగా పాదాలు తాకుతాం…

సరిహద్దుల్లో మన సైనికులోలె కరోనా శత్రువుతో యుద్ధం చేసే…

మన అత్యవసర సేవకులందరి అండదండతో క్రమశిక్షణతో…

కరోనాను తునుమాడి తీరుతాం… ఏ…..

ఎవతిరా ఇది ఎవ్వతిరా… ఈ కరోనా రక్కసి ఎవ్వతిరా…

ఎంతదిరా ఇది ఎంతదిరా… మనసంకల్పం ముందెంతదిరా…


Lyrics Coming soon...

Submit / Contribute This Lyrics


Listen this Song in Online!

Share this Song!

More Songs from Etv Network Movie

  1. Suddala Ashok Teja Yavathi Ra Corona Song Lyrics

Suddala Ashok Teja Yavathi Ra Corona Song FAQ

What movie is Suddala Ashok Teja Yavathi Ra Corona song from?

Suddala Ashok Teja Yavathi Ra Corona song is from the Etv Network movie.

Who sang Suddala Ashok Teja Yavathi Ra Corona song?

Suddala Ashok Teja Yavathi Ra Corona song was sung by Sai Charan, Yasho Krishna.

Who wrote Suddala Ashok Teja Yavathi Ra Corona song lyrics?

Suddala Ashok Teja Yavathi Ra Corona song lyrics were written by Dr. Suddala Ashok Teja.

Who composed music for Suddala Ashok Teja Yavathi Ra Corona song?

Suddala Ashok Teja Yavathi Ra Corona song music was composed by Yasho Krishna.