| Movie Name | Shivaratri Song 2026 (2026) |
|---|---|
| Director | |
| Star Cast | hanumnath Yadav |
| Music | |
| Singer(s) | hanumnath Yadav |
| Lyricist | |
| Music Label |
Shivaratri Song 2026 Full Song | Mounikayadav | hanumnath Yadav | kondarajendhar | Honeyganesh
జగములేలె సామి జంగమయ్య దేవుడా
మామీదే ఉండాలి శంకురుడా మీదయా
ఏడేడు లోకాలు ఎండి కొండనేలగా
నీఅందుల సల్లంగా మమ్మూల సూడయా
ఒ యములాడా రా యేసుడ నీకు దండమే
ఉపవాసాలు మీకు దండిగుందుమే
వార వారముల నిష్టతొ నీకు పూజలే
ఏరికోరి కొడుతుర కొబ్బేరికాయలే
ఓ శంకరా దిగంబరా మా దిక్కు నువ్వేరా
చెట్టూ పుట్టా అంతా నువ్వే జగమంతా స్వామి
నువు చేసిన బొమ్మలే కదా మేమంతా
బంధాాలను పెంచేది నువే భగవంతా
స్వామి సివరికి సితికంపుడేెందొ నీవింత
కాటిలొ కట్టెవా కాలిన దేహమా
కరుణే సూపుతవా మూడు కన్నుల ఈశ్వరా
మెడలో సర్పమా బూడిద దేహమా
కంఠాన గరళాన్ని దాచిన శివశంకరా
ఉదరగిద్ద సాలునయ్య బాధలు తొలగిస్తవ
నీ భుజములపైనే మమ్ముల నడిపిస్తవా
కోపమచ్చెనంటె స్వామి కండ్లెర్రజేత్తవా
మారెడాకులిత్తె సామి మనసు నిమ్మలమైతవా
శివలింగరూపుడా శంకర నీచిత్రములేందయా
చెట్టూ పుట్టా అంతా నువ్వే జగమంతా స్వామి
నువు చేసిన బొమ్మలే కదా మేమంతా
బంధాాలను పెంచేది నువే భగవంతా
స్వామి సివరికి సితికంపుడేెందొ నీవింత
భోలాశంకరా నాలుగు దిక్కులా
నడిసే నాస్వామివో సోమేశుడా
అంతమె లేనివాడ అనంతకారుడా
డమరుకనాధుడా దయుంచురా శివా
అండపిండ లోకము బ్రహ్మాండము నీవేనురా
నీ అంతరార్దమేమిటొ అర్దమె కాదేరా
ఆడ ఈడ ఏడ చూడు అంతా నీవేరా
పండ్లజడల స్వామీ పాపాలను తొలగించు
నందీశ్వర నాగేశ్వర ఓ రాజా రాజేశ్వరా
చెట్టూ పుట్టా అంతా నువ్వే జగమంతా స్వామి
నువు చేసిన బొమ్మలే కదా మేమంతా
బంధాాలను పెంచేది నువే భగవంతా
స్వామి సివరికి సితికంపుడేెందొ నీవింత