
| Movie Name | Amrutharamam |
|---|---|
| Director | Surender Kontaddi |
| Star Cast | Ram Mittakanti, Amitha Ranganath |
| Music | Ns Prasu |
| Singer(s) | Ananya Bhat |
| Lyricist | Madhusudhan Ramadurgam |
| Music Label |
తారాగణం: రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్
ఆడియో: మధుర ఆడియో
ప్రేమంటే ఇంతేనా… ఎదలోని వ్యథలేనా
ఎడబాటై మిగిలేనా…కన్నీరై కురిసేనా
ఎదుట లేవని… కలలో రావని
కలత వరదై పారనా…
పొంగేటి రంగుల్లోనా.. ఊరించే ఊహల్లోన
నీ రూపు..
నీ చూపు.. నిండెనే…
పిలుపు లేదని…
బదులు ఏదని…
ఎదురు చూసితిరా…
నీవు రానిది
చిన్నబోయితి… చితికిపోయితిరా…
నీవు లేనిదే బ్రతుకు లేదని
చితిని చూపితిరా…
ప్రేమ లేదని..
ప్రేమ కాదని..
అన్నదెవరీ జగతిలో.
రెక్క తెగిన పావురంలా.. పరువమే పడిపోయేగా
మనసు లోపల ముసురుతున్న..
మౌనవేదన తెలపనా..
మలుపు తిరిగిన.. వలపు దారిలో
సొదల రొదగా నిలవనా..
కనుల నీటితో రాసుకున్న
విరహ కథలివి తెలుసునా…
గుండె లోపలి..
ఘోష ఏదో..
గాయమై నను తాకినా…
నిన్ను కాదని..
నేను లేదని..
వెర్రి గొంతుతో అరవనా..
నేల రాలిన..
వెలుగు ఆరిన..
తారలా నే మిగలనా…
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Premante Inthenaa song is from the Amrutharamam movie.
Premante Inthenaa song was sung by Ananya Bhat.
Premante Inthenaa song lyrics were written by Madhusudhan Ramadurgam.
Premante Inthenaa song music was composed by Ns Prasu.