
| Movie Name | Panthulamma (1978) |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Ranganath, Lakshmi, Deepa, Sarath Babu |
| Music | Rajan-Nagendra |
| Singer(s) | S P Balasubramanyam |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label | Saregama South |
Panthulamma Yedarilo Koyila Lyrics in Telugu
ఆఆ ఆ ఆఆ ఆ మ్మ్ మ్మ్
ఎడారిలో కోయిలా
తెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా
తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా
తెల్లారనీ రేయిలా
పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే.
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే.
ఎద వీణపై అనురాగమై
తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే, శిల అయితే
మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా
మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై
రగిలింది ఈ రాలుపూత
రగిలింది ఈ రాలుపూత
విధిరాతచేతా నా స్వర్ణసీతా
ఎడారిలో కోయిలా… తెల్లారనీ రేయిలా
కొన్ని పాటలింతే, గుండెకోతలోనే చిగురిస్తాయ్.
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి.
ఆ రూపమే నా దీపమై వెలిగింది
మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా
వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై
చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే
చేదైన ఒక తీపి పాట
చేదైన ఒక తీపి పాట
చెలిలేని పాటా… ఒక చేదుపాటా
ఎడారిలో కోయిలా… తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్ని గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా… తెల్లారనీ రేయిలా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Panthulamma Yedarilo Koyila song is from the Panthulamma movie.
Panthulamma Yedarilo Koyila song was sung by S P Balasubramanyam.
Panthulamma Yedarilo Koyila song lyrics were written by Veturi Sundararama Murthy.
Panthulamma Yedarilo Koyila song music was composed by Rajan-Nagendra.