
| Movie Name | America Ammayi (1976) |
|---|---|
| Director | Singeetam Srinivasa Rao |
| Star Cast | Annick Chaymotty, Ranganath, Deepa |
| Music | GK Venkatesh |
| Singer(s) | S P Balasubramanyam, Suseela |
| Lyricist | Devulapalli Krishna Sastry |
| Music Label | Shalimar Film Express |
Paadana Telugu Paata Lyrics in Telugu
పాడనా తెనుగు పాటా
పాడనా తెనుగు పాటా
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాటా
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మోపుల పైన
మసలే గాలుల గుస గుసలో
మంచి ముత్యాల పేట
మధురామృతాల తేట ఒక పాట
పాడనా తెనుగు పాటా
పాడనా తెనుగు పాటా
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాటా
త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినదీ ఈ ఈ ఆ ఆఆ
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినదీ
నాడునాడులా కదిలించేది
వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట
ఒక పాట పాడనా తెలుగు పాట
ఒళ్ళంత వయ్యారి కోక
కళ్ళకు కాటుక రేఖ
ఒళ్ళంత వయ్యారి కోక
కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్ళకు పారణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెనుగు తల్లి పెట్టని కోట
తెనుగు నాట ప్రతి చోట ఒక పాట
పాడనా తెనుగు పాటా
పరవశనై, నీ పరవశనై
మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగు పాటా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Paadana Paata song is from the America Ammayi movie.
Paadana Paata song was sung by S P Balasubramanyam, Suseela.
Paadana Paata song lyrics were written by Devulapalli Krishna Sastry.
Paadana Paata song music was composed by GK Venkatesh.