MAMIDI KONALA MEENA Song Lyrics - Folk Song 2026

MAMIDI KONALA MEENA Song Lyrics - Folk Song 2026
MAMIDI KONALA MEENA Song Lyrics penned by Kamal Eslavath, music composed by Kalyan Keys, and sung by Madhu Priya from Telugu cinema ‘Folk Song 2026‘.
MAMIDI KONALA MEENA Song Lyrics: MAMIDI KONALA MEENA is a Telugu song from the film Folk Song 2026 starring Nagadurga - Nagavva, directed by Shekar virus. "MAMIDI KONALA MEENA" song was composed by Kalyan Keys and sung by Madhu Priya, with lyrics written by Kamal Eslavath.

MAMIDI KONALA MEENA Song Details

Movie NameFolk Song 2026 (2026)
DirectorShekar virus
Star CastNagadurga - Nagavva
MusicKalyan Keys
Singer(s)Madhu Priya
LyricistKamal Eslavath
Music LabelHamara villages

MAMIDI KONALA MEENA Song Lyrics in Telugu

మామిడి కోనల మీనా…
మామిడి కోనల మీనా…

మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
మనసులు ఎవ్వరి మీదనే…

యాప కొమ్మల మీనా పొద్దులేమో గూకినాయి
యాప కొమ్మల మీనా పొద్దులేమో గూకినాయి
యాపతి ఎవ్వరి కోసమే ఓ బూజవ్వ
యాపతి ఎవ్వరి కోసమే…

 

గల్లా గల్లల్లా లుంగీ నడుముకు సూట్టి
తెల్ల తెల్లటి అంగీకి అత్తరు కొట్టి
బంగారి ముద్దుటుంగరాలే పెట్టి
బాల మీసాలే దువ్వుకుంటూ నా కొరకే దారి పట్టే
యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ
సోపతి యాపతి కోసమే…
యాపతి సోపతి కోసమే ఓ నాగవ్వ
సోపతి యాపతి కోసమే…

మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
మనసులు ఎవ్వరి మీదనే…

మామిడి కోనల మీనా…
మామిడి కోనల మీనా…

చింత చిగురుల మీనా చిలకలేమో వాలినాయి
చింత చిగురుల మీనా చిలకలేమో వాలినాయి
చిత్తము ఎవ్వరి కోసమే ఓ బూజవ్వ
చిత్తము ఎవ్వరి కోసమే…

 

చిలుక పచ్చటి చీర సింగులు చెక్కి
వాని జాడ గాచి ఎదురుచూస్తీ బంగుల ఎక్కి
చిన్నోని సోయిల చెంపలు ఎరుపెక్కి
రాలుగాయి నా మనసు వాని ముసి ముసి నువ్వుల్లో చిక్కే
చిత్తం చిన్నోని మీదనే ఓ నాగవ్వ
మొత్తం మేనోని మీదనే…
చిత్తం చిన్నోని మీదనే ఓ నాగవ్వ
మొత్తం మేనోని మీదనే…

మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మామిడి కోనల మీనా మబ్బులేమో నిలిచినాయి
మనసులు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
మనసులు ఎవ్వరి మీదనే…

బంతి పువ్వుల మీనా బాసలేవో పూసినాయి
బంతి పువ్వుల మీనా బాసలేవో పూసినాయి
బామలు ఎవ్వరి మీదనే ఓ బూజవ్వ
బామలు ఎవ్వరి మీదనే…

బోలు గజ్జెల పట్టిలే పెట్టుకొని
బుగ్గలున్న లంగా జాకెట్టే కట్టుకొని
బుట్ట కమ్ములు బొట్టే దిద్దుకొని
ఇరుగు పోరుగంటూ లేని యాల వాని అరుగు తొక్కంగా
బామలు నా బావ మీదనే ఓ నాగవ్వ
బారబారు వాని మీదనే…
బామలు నా బావ మీదనే ఓ నాగవ్వ
బాజాప్త వాని మీదనే…

Listen this Song in Online!

Share this Song!

More Songs from Folk Song 2026 Movie

  1. Anna Neekosam Song Lyrics
  2. SAMMAKKA SARALAMMA Song Lyrics
  3. Sukkole Merisina Medaaramullo Song Lyrics
  4. Gajulu Bangaru Gajulu Song Lyrics
  5. KADADHAKA NEETHONE Song Lyrics
  6. MAMIDI KONALA MEENA Song Lyrics