| Movie Name | Malupu (2023) |
|---|---|
| Director | Vinay Shanmukh |
| Star Cast | Shanmukh Jaswanth, Deepthi Sunaina |
| Music | Manish Kumar |
| Singer(s) | Manish Kumar |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Shanmukh Jaswanth |
సమయమే ఇక దొరకదు
నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని
ఊపిరిలో కలవరమా
గతమునే మది తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే
ఎప్పటికీ మన కథగా
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
కల ఇదా….
నిజమిదా….
కధ ఇదా…
మలుపిదా…
నీ అడుగులలో అడుగే పడినపుడే
ఈ జన్మే నీతో చాలనుకున్నాగా
నీ పెదవులపై మిగిలే చిరునవ్వై
ఈ జన్మే నీకే రాసిస్తున్నాగా
నిమిషాలన్నీ నిమిషం ఆపేనా
గడియారంతో సమరం చేస్తున్నా
లేనే లేదే వేరే మాటే ప్రాణం నీవే
కల ఇదా….
నిజమిదా….
సమయమే ఇక దొరకదు
నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని
ఊపిరిలో కలవరమా
గతమునే మది తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే
ఎప్పటికీ మన కథగా
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా దూరం చేసే ప్రేమే నీదే
కల ఇదా ఇదా…
నిజమిదా…
కధ ఇదా…
మలుపిదా….