Movie Name | NEW FOLK SONG 2025 (2025) |
---|---|
Director | Suresh Suriya |
Star Cast | Yamuna Tarak - Kittu Pavan |
Music | Venkat Ajmeera |
Singer(s) | Kongari Krishna |
Lyricist | Kongari Krishna |
Music Label |
నటీనటులు: యమునా తారక్ (Yamuna Tarak) – కిట్టు పవన్ (Kittu Pavan)
లిరిక్స్ – గాయకుడు: కొంగరి కృష్ణ (Kongari Krishna)
గాయని: శ్రీనిధి నరెళ్ల (Srinidhi Narella)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
దర్శకత్వం : సురేష్ సూర్య (Suresh Suriya)
నిర్మాత: ప్రశాంత్ గోవిందరామ్ (Prashanth Govindaram)
నీలి నీలి మేఘాల పల్లకి
నీలి నీలి మేఘాల పల్లకి
నేను తెచ్చిన నిన్నుపడానికి
నీలి నీలి మేఘాల పల్లకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మతి తప్పే పిల్లగా నీ మాటకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మల్లె మందారాల పువ్వులల్లా
నిన్ను ఊపుతనే ఉయ్యలల్లా
జాజి జాపత్రిల పూలు తెచ్చి
నేను కడతానే నీ సిగలో గుచ్చి
నీలి నీలి మేఘాల పల్లకి
నీలి నీలి మేఘాల పల్లకి
నేను తెచ్చిన నిన్నుపడానికి
నీలి నీలి మేఘాల పల్లకి
అడవి తీగ మల్లె పువ్వులాగా అల్లి
పాడయ్యాకయ్య నీ మాటలల్లా
సిగకు చిత్రాల పూలు తెచ్చిన
నేను చిక్కనయ్యా నీ చేతులల్లా
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మతి తప్పే పిల్లగా నీ మాటకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
తంగేడు చామంతి పువ్వులల్లా
నిన్ను చూసుకుంటా పిల్ల పాణమల్ల
పారాణి భూసిన పసుపులల్లా
పిల్ల మెరిసినవే నువ్వు ఓ తార లా
వెన్నెల గురుసేటి రాత్రులల్లా
నేను సిక్కనయ్యా నీ సూపులల్లా
పాల గంకుల మీది చిలకలెక్క
నువ్వు పలకకయ్య ఒట్టి మాటలింక
ఘల్లు ఘల్లు గాజుల సప్పుడుకు
వెంటబడుతున్నానే నీ నవ్వులకు
ఘల్లు ఘల్లు గాజుల సప్పుడుకు
వెనకబడుతున్నానే నీ నవ్వులకు
పచ్చటి పైరుల్లో ఆడంగానే
నా మనసు పరవశించి నిన్ను చేరెనే
పచ్చటి పైరుల్లో ఆడంగానే
నా మనసు పరవశించి నిన్ను చేరెనే
అలల మీది కలువ పువ్వులాగా
ఎంత అందమున్నవే నీ నవ్వులా
నల్లమబ్బుల నడుమ వెన్నెలమ్మ
నువ్వు తడిసి కురవకమ్మ జాబిలమ్మ
కురుసేటి ఆ ముసురు చినుకులల్లా
మత్తు వచ్చేటి ఆ మట్టి వాసనలా
పచ్చని ఆ పైరు గాలులాగా
మరిసితినయ్యా నేను నీ మాటల్లా
సెలయేరు అల సప్పుడ్లకు
వెనకబడుతున్నా నీ మీది ప్రేమలకు
సెలయేరు అల సప్పుడ్లకు
వెనకబడుతున్నా నీ మీది ప్రేమలకు
చిటపట కురిసేటి చినుకులకు
తడిసినాను పిల్లగా నీ సూపులకు
చిటపట కురిసేటి చినుకులకు
తడిసినాను పిల్లగా నీ సూపులకు
గోరెంట బంతి పువ్వులల్లా
నువ్వు మెరిసినవే కట్ల పులా నడుమ
పట్టు గుజ్జులాంటి పైటలేసి
గుణుకు పువ్వులాంటి పిల్ల రైక తొడిగి
చేతుల్లో పిల్లనా గ్రోవి పెట్టి
సిద్ధురాల చిన్న పాట నువ్ పాడినా
చిన్ని కృష్ణుడండి చిలిపి పనులు చూసి
దగ్గర అవుతున్న కలగలిసే బంధానికి
నువ్వు నడువంగా మువ్వల సప్పుడాయే
ఆ సప్పుడుకు నీ వెనకే వచ్చుడాయే
నువ్వు నడువంగా మువ్వల సప్పుడాయే
ఆ సప్పుడుకు నీ వెనకే వచ్చుడాయే
నువ్వు సరిగమ పదనిసలు పాడంగానే
నేను జంట పాడే నీకు తోడవుతూనే
నువ్వు సరిగమ పదనిసలు పాడంగానే
నేను జంట పాడే నీకు తోడవుతూనే
నీలి నీలి మేఘాల పల్లకి
నీలి నీలి మేఘాల పల్లకి
నేను తెచ్చిన నిన్నుపడానికి
నీలి నీలి మేఘాల పల్లకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి
మతి తప్పే పిల్లగా నీ మాటకి
మినుకు మినుకు నీ కంటి సూపుకి