Kammani ee Prema Lekha ne Song Lyrics
Movie : Gunaa
Featuring : Kamala Hassan, Roshini
Music : Ilayaraja
Singer : SP Balasubramanyam, SP Sailaja
Director : Santhana Bharathi
Kammani ee Prema Lekha ne Song Lyrics
Kammani ee prema lekhane
Rasindi hrudayame
Priyatama neevachata kushalama
Nenichata kushalame
Uhalanni paatale kanula thotalo
Toli kalala kavitale mata maatalo
Kammani ee prema lekhane
Rasindi hrudayame
Priyatama neevachata kushalama
Nenichata kushalame
Uhalanni paatale kanula thotalo
Toli kalala kavitale mata maatalo
Oho kammani ee prema lekhane
Rasindi hrudayame
Priyatama neevachata kushalama
Nenichata kushalame
Gundello gayamemo challanga manipoye
Maya chese a maye premayae
Enta gayamaina gaani na menikemigadu
Puvvu soki nee soku kandene
Veliki rani verri prema
Kanneeti dharalona karugutunnadi
Naadu shokamopaleka
Nee gunde badha padite thaalanannadi
Manushulerugaleru
Maamoolu prema kaadu
Agni kante swacchamainadi
Mamakaarame ee laali paataga
Rasedi hrudayamaa
Umadevi ga shivuni ardha bhagamai
Na lona niluvumaa
Shubha laali laali jo laali laali jo
Umadevi laali jo laali laali jo
Mamakaarame ee laali paataga
Rasedi hrudayamaa
Na hridayamaa….
గుణ: ఉ రాయి.. రాయీ..
ఉమాదేవి: ఎం రాయాలి..
గుణ: లెట్టెర్ ..
ఉమాదేవి: ఎవరికి..
గుణ: నీకు
ఉమాదేవి: నాకా..
గుణ: ఉ..
గుణ: నాకు రాయటం రాదు.. ఈ మధ్యనే సంతకం పెట్టటం నేర్చుకున్నా..
ఉమాదేవి: వెయిట్ వెయిట్.. నాకు నువు రాసే ఉత్తరం నేను రాసి..
గుణ: నాకు చదివి వినిపించి తరువాత నువ్వు చదువుకోవాలి..
ఉమాదేవి: ఐ లైక్ ఇట్ .. ఉ చెప్పు..
గుణ: నా ప్రియా..ప్రెమతొ.. నీకు.. నే.. నేను.. రాసే..
ఉత్తరం .. లెట్టెర్ .. ఛ.. లెట్టెర్.. కాదు.. ఉత్తరవే.. అని రాయి.. చదువు..
ఉమాదేవి: కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హౄదయమే..
గుణ: పాటలా మార్చి రాసావా.. అప్పుడు నేనుకూడ మారుస్తా....
మొదట..నా ప్రియా.. అన్నాకదా..అక్కడ ప్రియతమా అని మార్చుకో..
ప్రియతమా..నీ ఇంట్లో క్షేమమా.. నేను ఇక్కడ క్షేమం..
ఉమాదేవి: ప్రియతమా.. నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
గుణ: ఆహ..ఓహొ కవిత్వం ..
నేను ఉహించుకుంటే కవిత మనసులొ వరదలా పొంగుతుంది.. కానీ..
అదంతా రాయాలని కూర్చుంటే.. అక్షరాలే..మాటలే..
ఉమాదేవి: ఊహలన్నీ పాటలే..కనుల తోటలో.. అదే.. తొలి కలల కవితలే.. మాట మాట లో..
గుణ: అదే.. ఆహా.. బ్రహ్మాండం..కవిత కవిత..ఉ..పాడు..
ఉమాదేవి: కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హౄదయమే..
ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
ఊహలన్నీ పాటలే..కనుల తోటలో.. తొలి కలల కవితలే.. మాట మాట లో..
ఒహో..కమ్మని ఈ ప్రేమలేఖని రాసింది హౄదయమే..
గుణ: లాలలా..లాలాల లాలాల లాలలా..
ఉమాదేవి: ప్రియతమా నీవచట కుశలమా..నేనిచట కుశలమే..
గుణ: లాలలా..లాలాల లాలాల లాలలా..
గుణ: నాకు తగిలిన గాయం అదే.. చల్లగ మానిపోతుంది..
అదెవిటో నాకుతెలీదు..ఎమ్మాయో తెలీదు.. నాకేవీకాదసలు..
ఇదికూడా..రాసుకో..అక్కడక్కడా..పువ్వు నవ్వు ప్రేమ.. అలాంటివి వెసుకోవాలి..ఆ..
ఇదిగో చూడు..నాకు ఏ గాయమైనప్పటికీ వొళ్ళు తట్టుకుంటుంది..
నీ వొళ్ళు తట్టుకుంటుందా.. తట్టుకోదు.. ఉమాదేవి.. దేవి ఉమాదేవి..
ఉమాదేవి: అది కూడ.. రాయాలా..
గుణ: అహ హ .. అది ప్రేమ..నా ప్రేమ ఎలా చెప్పాలో తెలీక..ఇదవ్వుతుంటే.. ఏడుపొస్తుంది..
కాని.. నేనేడ్చి.. నాశోకం నిన్నుకూడ.. బాధపెడుతుందనుకున్నప్పుడు, వచ్చే కన్నీరు కూడా.. ఆగుతుంది..
మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలాగ స్వచ్చమైనది..
ఉమాదేవి: గుండెల్లొ గాయమేమో చల్లంగ మానిపోయె.. మాయజేసె ఆమాయె ప్రేమాయె..
ఎంత గాయమైనగాని.. నామేనికి ఎమికాదు.. పూవుశోకి నీమేను కందేనే..
వెలికిరాని వెర్రి ప్రేమ.. కన్నీటి ధారలోన కరుగుతున్నదీ..
నాదు శోకమోపలేక నీగుండె బాధపడితే.. తాళనన్నదీ..
మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు.. అగ్నికంటె స్వచ్ఛమైనదీ..
గుణ: మమకారమే ఈ లాలిపాటగారాసేది హౄదయమా.. ఉమాదేవిగా శివుని అర్ధభాగమై నాలోన నిలువుమా..
శుభలాలిలాలిజో.. లాలిలాలిజో..ఉమాదేవి లాలిజో లాలిజో.
మమకారమే ఈ లాలిపాటగారాసేది హౄదయమా.. నా హౄదయమా.