
| Movie Name | 10Th Class Diaries |
|---|---|
| Director | Garudavega Anji |
| Star Cast | Srikanth, Avika Gor |
| Music | Suresh Bobbili |
| Singer(s) | Chinmayee Sripada |
| Lyricist | Suresh Gangula |
| Music Label | Aditya Music |
హో, ఎగిరే ఎగిరే… నా పాదాలు పైకెగిరే
దిగవే దిగవే… దిగమన్న ఆకాశమే
ఎగిరే ఎగిరే… లేరెవరంటూ మనకెదురే
ఎదురయ్యనులే సరికొత్త ఆనందమే
పదవే పదవే మనసా
పంజరమొదిలి వయస
పచ్చని కలలే తెలుసా
పల్లకీ తెచ్చెనే
వినవే వినవే సొగస
స్వేచ్ఛగా అడుగే వేసా
సంకెళ్లన్నీ తెంచి
దిక్కులే దాటవే
పరదా దాటేసిన
సరద చూపించన
వరదై ఈ వేగాన
ఓ రాగాన నేనే సాగనా
ఎన్నో వర్ణాల వానవిల్లే
నన్నే అల్లిందే స్నేహమల్లే
వచ్చి వాలిందే కళ్లముందే ఇవ్వాలే
కొమ్మారెమ్మల్లో కోయిలల్లే
కొత్త రాగాలె పొంగి పొర్లే
ఇంత ఆనందం లేదు ముందే నీవల్లే
గదిలో ఒదిగున్న నా ఊసులే
వదిలా సీతకోకచిలకై
మదిలో అనిగున్న నా ఆశలే
అలలై ఉవ్వెత్తునెగిసాయిలే
అదుపు మరిచా అడుగే విడిచా
పరుగె తీసా సెలయేరులా
కనులే తెరిచా కలలే కలిసా
మరల మనిషై నేడు పుట్టానిలా
ఒక్కో క్షణాన్నే ఒడిసిపడదాం
ఒక్కో రకంగా ఎగసిపడదాం
ఇంకో లోకంలో అడుగుపెడదాం ఇవ్వాలే
గతమే గుర్తంటు లేనంతగా
గడిపా ఒక్కో క్షణమే వరమై
ఇకపై ప్రతిరోజు నాదంటుగా
మనసే విరిసింది వాసంతమై
వీచేగాలై తోచే దిశగా
అడుగే కదిపా నలువైపులా
అడిగే వారే అసలే లేరుగా
కనుకే చినుకై చెలరేగిపోయానిలా
ప్రాయం అలల్లా పొంగిపోయే
ప్రాణం గాలుల్లో తేలిపోయే
భారం కనుల్లో తీరిపోయే ఈ వేళే
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Egirey Egirey song is from the 10Th Class Diaries movie.
Egirey Egirey song was sung by Chinmayee Sripada.
Egirey Egirey song lyrics were written by Suresh Gangula.
Egirey Egirey song music was composed by Suresh Bobbili.