| Movie Name | Amma Paata 2024 (2024) |
|---|---|
| Director | Thirupathi gauni |
| Star Cast | Janhavi Yerram |
| Music | Sisco Disco |
| Singer(s) | Janhavi Yerram |
| Lyricist | Surender Mittapalli |
| Music Label | Mittapalli Studio |
అమ్మపాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట......
అమ్మపాడే లాలి పాట తేనెలోరే పరే
యేరులంట......
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లిసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి....
ఉగ్గును పట్టి ఉయ్యాలలుపే అమ్మా లాలన....
ఊపిరి పోసే నూరేళ్ల నిండు దీవెన ....
(అమ్మ పాడే)
కురిసే వాన చినుకులకి నిలినింగి అమ్మ...
మొలేచే పచ్చని పైరులకీ నేలతల్లి అమ్మ...(2)
వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మ
ప్రకృతి పాడే పాటలకీ వెలుకువి అమ్మ..
సృష్టికీ మూలం అమ్మతనం.,...
సృష్టికీ మూలం అమ్మతనం.....
సృష్టించలేనిధి అమ్మ గుణం...
(అమ్మ పాడే)
నింగినీ తాకే మెడలకి పునాది రాయి అమ్మ....
అందం పొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ....(2)
చీకటి చెరిపే వెన్నెలకీ జాబిల్లి అమ్మ....
లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ...
అమ్మంటే అనురాగ జివని.....
అమ్మంటే అనురాగ జీవని.....
అమ్మ ప్రేమే సంజీవని.....
అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట....
నమ్మ..అమ్మ పాడే లాలి పాట తేనెలోరే పారే యేరులంట....
నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి...
నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ...
ఉగ్గిని పట్టీ ఉయ్యలలుపే అమ్మ లాలన
ఊపీరి పోసే నూరేళ్ల నిండు దీవెన ...
అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తియ్యనంట...
మా అమ్మ పాడే లాలీ పాట తేనెలోరే పరే యేరులంట.....